schedule Thursday, September 03, 2026

బాబోయ్.. పెట్రోల్ దొంగలు..!

calendar_today December 29, 2025
person dharshininews
బాబోయ్.. పెట్రోల్ దొంగలు..!
బాబోయ్.. పెట్రోల్ దొంగలు..! - పోలీసులున్న కాలనీలోనే లూటీ - సీసీ కెమెరాలలో చోరీ దృశ్యాల రికార్డు - తాండూరు పట్టణంలో వెలుగులోకి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎవరైనా ఖర్చుల కోసమో.. జల్సాల కోసమో బంగారం, డబ్బులు, వస్తువులు చోరి చేస్తారు. కాని ఈ వైరటీ దొంగలు పార్కింగ్ చేసిన బైకుల నుంచి పెట్రోల్ లూటీ చేస్తూ.. బాబోయ్ పెట్రోల్‌ దొంగలు అనేలా చేశారు. ఈ సంఘటన తాండూరు పట్టణంలో వెలుగులోకి వచ్చింది. తాండూరు పట్టణం సాయిపూర్ పరిధిలో జానకీరాం నగర్‌(అయోధ్య నగర్‌) ఉంది. ఈ కాలనీలో పోలీసుశాఖలో పనిచేసే అధికారులు, సిబ్బంది కూడా తమ కుటుంబాలతో నివాసం ఉంటున్నారు. అయితే కాలనీలో ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన వాహానాలలో పెట్రోల్ మాయం అవుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈక్రమంలో కాలనీలోని సీసీ కెమెరాలను పరిశీలించగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ముఖాలకు మాస్కులు వేసుకుని పెట్రోల్ లూటీ చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. సుమారు నెల రోజలుగా ఇదే తరహాలో వాళ్లు పెట్రోల్ చోరీ చేయడం షాకింగ్‌కు గురిచేసింది. సోమవారం ఈ సంఘటన తీవ్ర దుమారం అయ్యింది. పోలీసులు ఉన్న కాలనీలోనే దొంగలు రెచ్చిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, స్థానికులు, ప్రజలు కోరుతున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40274/