schedule Thursday, September 03, 2026

శభాష్.. సాయి సుదీష్ణ..!

calendar_today December 28, 2025
person dharshininews
శభాష్.. సాయి సుదీష్ణ..!
శభాష్.. సాయి సుదీష్ణ..! - మహిళ క్రికెటర్‌కు బీఎస్ఆర్ ప్రశంస - జాతీయ జట్టుకు ఎంపికపై హర్షం తాండూరు, దర్శిని ప్రతినిధి : శభాష్ సాయి సుదీష్ణ అంటూ తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, ఆర్బీఓఎల్ ఎండీ సరళారెడ్డిలు అభినందించారు. తాండూరు పట్టణానికి చెందిన సాయి సుదీష్ణ వచ్చేనెల 1వ తేది నుంచి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే అండర్ 19 జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికైంది. ఈ సందర్భంగా ఆదివారం తాండూరు పట్టణంలోని తన నివాసంలో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, సరళారెడ్డి దంపతులు సాయి సుదీష్ణను అభినందించారు. సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మహిళ క్రికెటర్ సాయి సుదీష్ణ క్రికెట్ రాణించి భారత జట్టుకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. దేశానికి, తాండూరు ప్రాంతానికి గొప్ప పేరు తీసుకరావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నర్సిరెడ్డి, కోచ్ జగన్నాథ్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40249/