schedule Thursday, September 03, 2026

అదిరిందయ్యా.. మల్లారెడ్డి..!

calendar_today September 24, 2025
person dharshininews
అదిరిందయ్యా.. మల్లారెడ్డి..!
అదిరిందయ్యా.. మల్లారెడ్డి..! - వ్యవ'సాయానికి' డ్రోన్‌ వినియోగం - 100 ఎకరాలకు ఈజీగా మందుల పిచికారి - వినియోగం కోసం స్పెషల్ ట్రైనింగ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : డ్రోన్‌ అనగానే.. పెళ్లిళ్ల.. నేతల సభలలో చక్కర్లు కొట్టడమే కాదు. వ్యవసాయంలో రైతులకు అండగా కూడా నిలుస్తోంది. పంటల సాగుకు తోడ్పడుతూ.. మందుల పిచికారికి నేనుసైతం అంటూ అన్నదాతకు అండగా నిలుస్తోంది డ్రోన్. ఆదునిక టెక్నాలజీలో భాగంగా అందుబాటులోకి వచ్చిన డ్రోన్‌తో రైతులు వ్యవసాయం చేస్తున్నారు. వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల మండలం బెన్నూరు గ్రామానికి చెందిన మల్లారెడ్డి అనే రైతు కూడా డ్రోన్‌ వ్యవసాయంతో అదిరిందయ్యా.. అని అనిపించుకుంటున్నాడు. వ్యవసాయంలో డ్రోన్‌ను ఎలా వినియోగిస్తున్నాడో.. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. వ్యవసాయ శాస్త్రవేత్తలు.. కంపెనీలు డ్రోన్‌ వ్యవసాయంపై అవగాహన కల్పించడంతో ఆసక్తి పెరిగిందని రైతు మల్లారెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. ఇందులో భాగంగా రూ. 4లక్షల 50వేలు పెట్టి డ్రోన్ ను కొనుగోలు చేయడం జరిగింది అని తెలిపారు. ఈ డ్రోన్ వినియోగం కోసం మూడు రోజుల పాటు ప్రత్యేక ట్రైనింగ్ తీసుకోవడం జరిగిందని తెలిపారు. దీంతో వరి, పత్తి, కంది, మినుము, పెసర, మొక్కజొన్న తదితర పంటలకు మందుల పిచికారి ఈజీ చేయడం జరుగుతుందన్నారు. kvcs ఒక్కరోజు సుమారుగా 30 ఎకరాల నుండి 40 ఎకరాల వరకు డ్రోన్ ద్వారా మందు పిచికారి చేయడం జరుగుతుందని అంటున్నారు. మనుషులు రోజుల తరబడి చేసే పనులు గంటల్లోనే పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు 200 ఎకరాలకు పైగా పంటలకు మందుల పిచికారిని చేయడం జరిగిందని తెలిపారు. వ్యవసాయ రంగంలో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి పంటలో ఉత్పత్తిని పెంచుకోవచ్చు అని అన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38755/