schedule Thursday, September 03, 2026

ఖర్జూరం, పాలు కలిపి తాగితే..!

calendar_today September 5, 2025
person dharshininews
ఖర్జూరం, పాలు కలిపి తాగితే..!
ఖర్జూరం, పాలు కలిపి తాగితే..! - ఆరోగ్యాన్ని ఎన్ని ప్రయోజనాలో తెలుసా - ఎన్ని ఉపయోగాలున్నాయని తెలిస్తే వదలరు దర్శిని డెస్క్: ఖర్జూరం, పాలు కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ వీటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోవడం వల్ల దాని ఉపయోగాలు పోందలేకపోతున్నారు. ఖర్జూరం తినేవారు ఈ ఒక్క చిట్కా పాటిస్తే డబుల్ బెనిఫిట్ పొందవచ్చని అంటున్నారు. ముందుగా ఖర్జూరం, పాలలో ఉండే పోషకాలు గురించి తెలుసుకుందాం. ఖర్జూరం ఆరోగ్యానికి చాలా మంచిది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పాలలో కాల్షియం, ప్రోటీన్లు ఉంటాయి. ప్రతిరోజూ కొన్ని ఖర్జూరాలు తినడం వల్ల మన శరీరం శక్తివంతంగా ఉంటుంది. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. ఖర్జూరాన్ని పాలల్లో నానబెట్టి తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉంటాయి. ఈ సులభమైన పద్ధతి వల్ల దానిలోని పోషకాలు శరీరానికి బాగా అందుతాయి. ఒక గ్లాసు పాలలో 2-3 ఖర్జూరాలు రాత్రంతా నానబెట్టండి. ఉదయం ఆ మిశ్రమాన్ని తాగండి. కావాలంటే బ్లెండర్ లో వేసి షేక్ లా కూడా తీసుకోవచ్చు. kvcs ఖర్జూరంలో సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని ఇస్తాయి. పాలల్లో నానబెట్టి తాగితే, ఉదయాన్నే శక్తివంతంగా ఉంటారు. ఖర్జూరంలో పీచు (ఫైబర్) అధికంగా ఉంటుంది. నానబెట్టడం వల్ల ఈ పీచు సులభంగా జీర్ణమవుతుంది. ఇది మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. మొత్తం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఖర్జూరంలో ఇనుము ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది. పాలు, ఖర్జూరంలో ఉండే విటమిన్లు చర్మాన్ని పోషిస్తాయి. ఇది చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది. ఖర్జూరం, పాలు రెండింటిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఎముకలు, దంతాలకు కాల్షియం అవసరం. ఇది ఆస్టియోపొరోసిస్ లాంటి సమస్యలను నివారిస్తుంది. ఖర్జూరంలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. పాలల్లో ఉండే మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/38401/