schedule Thursday, September 03, 2026

చికిత్సకొచ్చిన జింక‌..!

calendar_today November 17, 2021
person dharshininews
చికిత్సకొచ్చిన జింక‌..!
చికిత్స కోసం చెంగుమంటూ..! - ఆసుప‌త్రికి వ‌చ్చిన జింక - ఆశ్చ‌ర్య పోయిన వైద్యులు - ఈ సంఘ‌ట‌న ఎక్క‌డంటే ద‌ర్శిని బ్యూరో : మ‌న‌షుల‌కు ఏదైనా గాయ‌మైతే.. ఆరోగ్యం క్షీణించిన‌ట్లు అనుమానం వ‌చ్చినా ఎవ‌రి స‌హాయం లేకుండా ఆసుప‌త్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటారు. అచ్చం మనుషుల్లాగే ఆలోచించేందేమో గాని ఓ జింక ఎవ‌రి స‌హ‌యం లేకుండా ఆసుప‌త్రికి వెళ్లింది. అదికూడ మామూలు ఆసుప‌త్రికి కాదండోయ్.. ఖ‌రీదైన కార్పోరేట్ ఆసుప‌త్రికి. త‌న చికిత్స కోసం ఆసుప‌త్రిలో జింక చేసిన హంగామా నెట్టింట్లి వైర‌ల్ కావ‌డమే కాకుండా విడియో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ సంఘ‌ట‌న యునైటెడ్ స్టేట్స్‌లోని లూసియానాలో చోటు చేసుకుంది. ఆసుప‌త్రికి స‌మీపంలో గాయ‌ప‌డిన ఈ జింక బాధ‌ప‌డుతు ఎవ‌రి స‌హాయం లేకుండా ఆసుప‌త్రికి చేరుకుంది. ఆసుపత్రి ముందు తలుపు గుండా పరిగెత్తింది. అయితే హాస్పిటల్ సిబ్బంది బంధించే ముందు ఎస్కలేటర్‌ పైకి ఎక్కింది. ఫ్లోర్ స్మూత్‌గా ఉండడంతో జారీ.. జారీ కిందపడుతూ ఎలాగోలా రెండవ అంతస్తులోకి చేరుకుంది. ఆసుప‌త్రిలో జింక‌ ఎస్కలేటర్‌ ఎక్కి రెండో అంత‌స్తుకు చేరుకున్న‌ హాడావుడిని చూసిన సిబ్బంది, సందర్శకులు ఆశ్చర్యానికి గుర‌య్యారు. జింక రెండో అంతస్తుకు చేరిన తర్వాత లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారితో సహా పలువురు వ్యక్తులు దానిని పట్టుకుని కిందకి దించారు. అనంతరం లూసియానా వైల్డ్‌లైఫ్ అండ్ ఫిషరీస్ డిపార్ట్‌మెంట్‌కు అందించారు. అంత‌కుముందు లూసియానా వన్యప్రాణి, మత్స్య శాఖ వెంటనే స్పందించి జంతువును పట్టుకోవడంలో సహాయం చేశారు. ఇదిలా ఉండ‌గా వన్య‌ప్రాణుల అధికారులు మాట్లాడుతూ జింక ఆసుప‌త్రికి చేరుకునే ముందు జింకను ఓ కారు ఢీకొట్టిందని చెబుతున్నారు. ఆసుప‌త్రిలో చేరిన జింక దురదృష్టవశాత్తు గాయాలతో మరణించినట్లు తెలుస్తోంది. జింక చేసిన హంగామా ఈ కింద విడియోలో చూడొచ్చు.. https://youtu.be/UH8V7dSH2zs