తాండూరు ప్రజలకు శుభవార్త..!
August 3, 2025
dharshininews
తాండూరు ప్రజలకు శుభవార్త..!
- రేపు మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు
- స్పెషలిస్ట్ వైద్యులతో పరీక్షలు, సేవలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు ప్రజలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు శుభవార్త చెప్పారు.
రేపు తాండూరులో మెగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా వైద్యాధికారి డా.లలితాదేవి, ఉప వైద్యాధికారి డా.రవీంద్రయాదవ్, మెడికల్ ఆఫీసర్ డా. గిరిధర్‌ల ఆధ్వర్యంలో తాండూరు పట్టణం ఇందిరానగర్‌లోని యూపీహెచ్‌సీ కేంద్రంలో ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు.
చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు ఆ సమస్యలకు అనుబంధంగా ఉన్న సమస్యలు ఉన్నవారికి, మానసిక సమస్యలు ఉన్నవారికి స్పెషలిస్టు వైద్యుల ద్వారా పరీక్షలు జరుపుతారని వెల్లడించారు. సోమవారం ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు మెడికల్ క్యాంపు కొనసాగుతుందని చెప్పారు. ఈ క్యాంపుని తాండూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు వినియోగించుకోగలరని విజ్ఞప్తి చేశారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/37396/