schedule Thursday, September 03, 2026

పక్కాగా ఓటర్ల నమోదు..!

calendar_today July 5, 2025
person dharshininews
పక్కాగా ఓటర్ల నమోదు..!
పక్కాగా ఓటర్ల నమోదు..! - మార్పులు, చేర్పులపై శ్రద్ధ వహించాలి - బీఎల్వోల శిక్షణ తాండూరు తహసీల్దార్ తారాసింగ్ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఓటర్ల నమోదును పక్కాగా నిర్వహించాలని తాండూరు తహసీల్దార్ తారాసింగ్ సూచించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు తాండూరు పట్టణం సాయిపూర్ లోని ప్రభుత్వ నెంబర్ 1 పాఠశాలలో తాండూరు బీఎల్వోలకు ఓటరు నమోదుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ తారాసింగ్ మాట్లాడుతూ బీఎల్వోలు ఇంటింటికి తిరిగి కొత్త ఓటర్ల నమోదు చేపట్టాలన్నారు. తప్పులు లేకుండా ఓటరు నమోదు చేసే బాధ్యత బీఎల్వోలదే అని అన్నారు. అంతేకాకుండా ఓటర్ల కార్డులో పాత ఫోటోలు తొలగించి, కొత్త ఫోటోలు ఆప్ లోడ్ చేయాలన్నారు. అదేవిధంగా ఫారం 6, 7, 8 నిర్వహణ శ్రద్ధగా నిర్వహించాలన్నారు. మార్పులు, చేర్పులు, చనిపోయిన వారి ఓటర్ల తొలగిపు పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. కుటుంబ సభ్యుల ఓట్లన్ని ఒకే కేంద్రంలో నమోదయ్యేలా దృష్టిసారించాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ఓటర్ల నమోదును పక్కాగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ లలిత, మాస్టర్ ట్రైనర్లు ముసాఫీర్, రాం నర్సింహారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36639/