schedule Thursday, September 03, 2026

ఎస్‌కేటీఎస్‌లో యోగా డే అదుర్స్..!

calendar_today June 21, 2025
person dharshininews
ఎస్‌కేటీఎస్‌లో యోగా డే అదుర్స్..!
ఎస్‌కేటీఎస్‌లో యోగా డే అదుర్స్..! - ఆసనాలతో ఆకట్టుకున్న విద్యార్థులు - యోగా ప్రయోజనాలపై అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ రోడ్డు మార్గంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌(ఎస్‌కేటీఎస్)లో ఇంటర్నేషన్‌ యోగా డేను అదుర్స్ అనిపించుకునేలా జరుపుకున్నారు. శనివారం యోగా డే సందర్బంగా స్కూల్ ప్రాంగణంలో విద్యార్థుల చేత యోగ ఆసనాలు వేయించారు. చిన్నారులు, విద్యార్థులు ఉత్సహాంగా పాల్గొని పలు రకాల ఆసనాలు వేశారు. విద్యార్థులు వేసిన యోగ ఆసనాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్బంగా టీచర్లు యోగా ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. చిన్నతనం నుంచే యోగా అలవాటు చేసుకుంటే మానసిక శ్రేయస్సుకు గణనీయమైన ప్రయోజనాలను చూపుతుందని తెలిపారు. విద్యార్థులు తమ చిన్నతనం నుంచే యోగాను నేర్చుకోవాలని సూచించారు. యోగా ఒత్తిడిని తగ్గించటంలో, ఏకాగ్రతను పెంచడంలో సహాయ పడుతుందని వివరించారు. అనంతరం కరస్పాండెంట్ సర్వోత్తమ్ రెడ్డి, డైరెక్టర్ జయవర్దన్ రెడ్డిలు మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు విద్యతో పాటు భారతీయ ప్రాచీన యోగ ఆసనాలు, సంప్రదాయాలపై అవగాహాన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36322/