ఐపీఎల్ చాలెంజ్ పిచ్చి.. పీక్స్..!
June 5, 2025
dharshininews
ఐపీఎల్ చాలెంజ్ పిచ్చి.. పీక్స్..!
- అర్దనగ్నంతో ఒకడు, అరగుండు, చెప్పుల దండతో ఇంకోడు
- చాలెంజ్ యాక్సెప్ట్ చేసి నిలుపుకున్న యువకులు
- వైరల్‌గా మారిన తాండూరు యువకుల ప్రదర్శన
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు జట్ల మద్యనే కాదు.. అభిమానుల మద్య పోటీ జరుగుతోంది. అభిమాన జట్లపై చాలెంజ్‌లు చేసుకోవడం.. వాటిని నిలుపుకోవడంలో ఎంతటి వరకు అయినా వెళుతారు. ఇటీవల జరిగిన ఆర్సీబీ, పంజాబ్ జట్ల మద్య పోటీపై అభిమానులు చాలెంజ్‌లు విసురుకున్నారు.
అయితే వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతానికి చెందిన యువకులు ఐపీల్ ఫైనల్ మ్యాచ్ పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో ఆర్సీబీ గెలుపొంది ఫైనల్ కప్ కొడితే, తాండూరు బస్ స్టాండ్ లో అర గుండు కొట్టుకొని, మెడలో చెప్పుల దండవేసుకొని తిరిగుతానని ఒకడు, తాండూరు పట్టణ చౌరస్తాలో తన షర్టు విప్పుకొని తిరుగుతానని మరొకడు ఛాలెంజ్‌లు చేసుకున్నారు. వీటిని ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్టులు చేవారు. పంజాబ్ టీంనూ ఆర్సీబీ గెలువడంతో చాలెంజ్‌లు చేసుకున్న యువకులు వాటిని నిలుపుకున్నారు. వాటిని కూడా ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్టులు చేసుకున్నారు. ఈ విడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఐపీఎల్ చాలెంజ్ పిచ్చిపై నెటిజన్లతో పాటు ప్రజలు కూడా పిచ్చి పీక్స్‌గా మారిందని, వీళ్లేంట్రా ఇలా తయారయ్యారు అంటూ అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/35966/