schedule Thursday, September 03, 2026

ఆర్యవైశ్య మహిళల జోష్‌..!

calendar_today March 3, 2025
person dharshininews
ఆర్యవైశ్య మహిళల జోష్‌..!
ఆర్యవైశ్య మహిళల జోష్‌..! - ఉత్సహాంగా క్రీడా ఉత్సవాలు - వాసవీ మహిళ సంఘం నేతృత్వంలో నిర్వహణ - విజేతలకు మెడల్స్ అందజేసిన మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ తాండూరు. దర్శిని ప్రతినిధి : తాండూరు వాసవీ మహిళా సంఘం అధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న పోటీలు జోష్‌ పుల్‌గా కొనసాగాయి. వాసవీ మహిళ సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్ నేతృత్వంలో ఆర్యవైశ్య సంఘం, హిందూ ధార్మిక పరిషత్ సహాకారంతో వాసవీ మహిళ సంఘం సంయక్తంగా మూడు రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహించారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని గత మూడు రోజులుగా మహిళలకు చెస్, క్యారమ్స్, కబడ్డీ పోటీలను నిర్వహించారు. సోమవారం క్రీడా పోటీలు ముగిశాయి. ఈ కార్యక్రమానికి మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య హాజరై విజేతలకు మెమెంటోలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ప్రతిభతో ముందుకు కీర్తి ప్రతిష్ఠలు పొందాలన్నారు. అదేవిధంగా వాసవీ మహిళ సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ మాట్లాడుతూ క్రీడా ఉత్సవాల్లో విజేతలుగా నిలిచిన ఆర్యవైశ్య మహిళలకు మార్చి 8న జరిగే అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా మెడల్స్, ట్రోఫీలు, సర్టిఫికెట్లను అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అలంపల్లి శ్రీనివాస్, కార్యదర్శి కోడూరి వినోద్ కుమార్, ఉపాధ్యక్షులు ఆకారం శివకుమార్, కోశాధికారి రొంపల్లి సంతోష్, సంపత్, హింధూ ధార్మిక పరిషత్ ట్రస్టీలు ఓం ప్రకాష్ సోమాని, పట్లోళ్ల వేణుగోపాల్ రెడ్డి, వాసవీ మహిళ సంఘం కోశాధికారి సింగంశెట్టి శోభ, సభ్యులు తాళ్లపల్లి కవిత, సరిత, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33704/