schedule Thursday, September 03, 2026

ధనియాల్లో.. ఔషధ గుణాలు..!

calendar_today February 22, 2025
person dharshininews
ధనియాల్లో.. ఔషధ గుణాలు..!
ధనియాల్లో.. ఔషధ గుణాలు..! - నానబెట్టి తీసుకుంటే ఇమ్యూనిటీ పెంపు - డయాబెటీస్‌ బాధితులకు మేలు దర్శిని డెస్క్ : ధనియాలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఆ నీళ్లను ఉదయాన్నే తాగితే కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ధనియాల్లోని ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ధనియాలను కేవలం వంటల్లో ఉపయోగించడం ద్వారా మాత్రమే కాకుండా.. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. ధనియాల్లో విటమిన్‌ కె, విటమిన్‌ సి, విటమిన్‌ ఎ పుష్కలంగా లభిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతి రోజు ధనియాలు నానబెట్టిన నీటిని తీసుకుంటే జుట్టు రాలుడు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రతిరోజు ఉదయం నానబెట్టిన ధనియాల నీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్‌కి వ్యతిరేకంగా పోరాడుతాయి. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి. సీజనల్‌ వ్యాధులైన జలుబు, దగ్గు లాంటి సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే రోజూ ధనియాల నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. కిడ్నీ సమస్యలతో బాధపడే వారికి కూడా ధనియాల నీరు బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా యూరినరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్ సమస్యలు ఉన్నవారు కూడా ధనియాల నీటిని రోజూ పరగడుపున తీసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారికి ఈ ధనియాల నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. ధనియాల నీటితో జీవక్రియ మెరుగవుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. తీసుకున్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. డయాబెటిస్‌ బాధితులకు కూడా ధనియాల నీరు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా రక్తంలో షుగర్‌ లెవల్స్‌ ఎక్కువగా ఉండేవారు ప్రతి రోజూ ఉదయం నానబెట్టిన ధనియాల నీటిని తీసుకుంటే షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ధనియా వాటర్‌ థైరాయిడ్‌ బాధితులకు కూడా మేలు చేస్తుంది. వీరు క్రమం తప్పకుండా కొత్తిమీర నీరు తాగితే థైరాయిడ్ లక్షణాలు తగ్గుతాయి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తాగాలి. ఇది థైరాయిడ్ నియంత్రణలో సాయపడుతుంది. థైరాయిడ్ మందులను తీసుకున్న గంట తర్వాతే ఈ నీటిని తీసుకోవాలి. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33343/