schedule Thursday, September 03, 2026

గాల్లో తేలుకుంటూ పరీక్షా కేంద్రానికి..!

calendar_today February 17, 2025
person dharshininews
గాల్లో తేలుకుంటూ పరీక్షా కేంద్రానికి..!
గాల్లో తేలుకుంటూ పరీక్షా కేంద్రానికి..! - పారాగ్లైడింగ్‌తో ఎగ్జామ్‌కు వెళిన విద్యార్థి - సోషల్ మీడియాలో వీడిలో వైరల్‌ దర్శిని డెస్క్ : పరీక్షల సమయంలో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఎంతో ఆందోళనకు గురవుతారు. టైంకు సెంటర్‌ చేరుకోవాలంటే ట్రాపిక్ సమస్యను దాటుకుని వెళ్లాల్సి వస్తుంది. దీంతో కొందరు విద్యార్ధులు టైంకి పరీక్ష కేంద్రాలకు చేరుకోలేక అవస్థలు పడుతున్నారు. తాజాగా ఓ విద్యార్ధికి ఇటువంటి సంకటం ఎందురైంది. అయితే కూర్చుని బాధపడకుండా పారాగ్లైడింగ్‌ సాయంతో మెరుపువేగంతో గాల్లో తేలుకుంటూ పరీక్ష కేంద్రంలో వాలిపోయాడు. ఈ విచిత్ర ఘటన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే... మహారాష్ట్రలోని సతారా జిల్లా వాయ్ తాలూకాలోని పసరాని గ్రామానికి చెందిన సమర్త్ మహాంగడే అనే విద్యార్థికి మరికొన్ని నిమిషాల్లో పరీక్ష ప్రారంభం కానుంది. పరీక్ష రాయడానికి కాలేజీకి బయలు దేరిన అతడికి వాయి-పంచగని రోడ్డులో భారీ ట్రాఫిక్‌ జామ్‌ కనిపించింది. రోడ్డుపై ఎంతకూ కదలని ట్రాఫిక్‌లో చిక్కుకున్నానని గ్రహించిన ఆ విద్యార్థి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే సాహస క్రీడల నిపుణుడైన గోవింద్‌ యెవాలె సాయం కోరాడు. ఆయన అంగీకరించడంతో నిపుణుడి సాయంతో పారాగ్లైడింగ్‌ దుస్తులు వేసుకొని, కాలేజీ బ్యాగును భుజాన వేసుకొని గాల్లో ఎగురుకుంటూ కాలేజీకి చేరుకున్నాడు. దీంతో సకాలంలో పరీక్షకు హాజరయ్యాడు. ఈ ఇందుకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి, సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయగా నెటిజన్లు షాక్‌కు గురయ్యారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతూ నెట్టింట హల్‌ చల్ చేస్తున్నారు. https://www.instagram.com/reel/DF-WvaTMi9R/?utm_source=ig_embed&ig_rid=444b96ba-ce83-4f01-b480-600981474201 https://www.instagram.com/reel/DF-WvaTMi9R/?utm_source=ig_web_copy_link ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33130/