schedule Thursday, September 03, 2026

వివరాల నమోదుకు ఫోన్ చేస్తే చాలు..!

calendar_today February 15, 2025
person dharshininews
వివరాల నమోదుకు ఫోన్ చేస్తే చాలు..!
వివరాల నమోదుకు ఫోన్ చేస్తే చాలు..! - కుల గణనకు టోల్‌ ఫ్రీ నెంబర్ - ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో కులగణనకు ప్రభుత్వం మరో చాన్స్ కల్పించింది. కుల గణనలో పేర్లు నమోదు చేసుకోలేని వారు రేపటి నుంచి నమోదు చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన టోఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేస్తే చాలు అని తెలిపింది. కులగణన వివరాల నమోదుకు టోల్‌ఫ్రీ నంబర్‌ 040-211 11111ను ఏర్పాటు చేసింది. ఎన్యుమరేటర్లు.. ఫోన్‌ చేసిన వారి ఇంటికి వెళ్లి వివరాలు నమోదు చేయనున్నారు. ఎంపీడీవో కార్యాలయం, వార్డు ఆఫీసులకు వెళ్లి కూడా వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్టు అధికారులు వెల్లడించారు. కులగణన సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా 3,56,323 కుటుంబాలు పాల్గొనలేదని అధికారులు లెక్కతేల్చారు. ఈనెల 28వ తేది వరకు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. లేదా https://seeepcsurvey.cgg.gov.in/ వెబ్ సైట్ నుంచి సర్వే ఫారం డౌన్ లోడ్ చేసుకుని నింపిన తరువాత ప్రజా పాలన కేంద్రాల్లో కూడా ఇవ్వొచ్చని తెలిపింది. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33094/