schedule Wednesday, September 09, 2026

ఎంసీహెచ్‌లో పసికందు మృతి..!

calendar_today February 4, 2025
person dharshininews
ఎంసీహెచ్‌లో పసికందు మృతి..!
ఎంసీహెచ్‌లో పసికందు మృతి..! - కుటుంభీకుల ఆందోళన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలని మాతా శిశు ఆసుపత్రి(ఎంసీహెచ్)లో ఓ పసికందు మృతి చెందింది. ఈ సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంభీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెద్దేముల్ మండలం తట్టెపల్లి గ్రామానికి చెందిన పిట్ల నర్సింలు భార్య రాజేశ్వరి నిండు గర్భిణీ. సోమవారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో 9 గంటల సమయంలో తాండూరులోని మాతా శిశు ఆసుపత్రికి తరలించారు. సుమారు గంట తరువాత బాబు పుట్టి చనిపోయినట్లు వైద్యులు చెప్పారని భర్త నర్సింలు తెలిపారు. ఆసుపత్రికి వచ్చిన తరువాత సరైన వైద్యం అందించలేదని, చాలా సమయం నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. మరోవైపు వైద్యులు మాట్లాడుతూ రాజేశ్వరికి వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయలేదని చెప్పుకొచ్చారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32815/