schedule Wednesday, September 09, 2026

చైనా మాంజాతో బాలుడికి గాయాలు

calendar_today January 12, 2025
person dharshininews
చైనా మాంజాతో బాలుడికి గాయాలు
చైనా మాంజాతో బాలుడికి గాయాలు - చేతి వేలుకు తగలడంతో ఆసుపత్రికి తరలింపు - తాండూరు పట్టణంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : చైనా మాంజా చాలా డేంజర్ అని అవగాహన కల్పిస్తున్నా కొందరు పట్టించుకోవడం లేదు. తాండూరు పట్టణంలో ఓ బాలుడు చైనా మాంజా వల్ల గాయాలపాలు అయ్యాడు. ఈ సంఘటన ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన శెట్టి చారు కుమారుడు వివేక్ సంక్రాంతి సెలవులు కావడంతో ఇంటిపైనా గాలి పటాలను ఎగురవేస్తున్నాడు. గాలి పటాలు ఎగురవేసేందుకు చైనా మాంజా వాడారు. గాలి పటాలు ఎగురవేసే క్రమంలో చైనా మాంజా చేతి వేలును కోసేసింది. తీవ్ర రక్త స్రావం కావడంతో గమనించిన కుటుంబీకులు వెంటనే తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు చికిత్స అందించారు. రక్తగాయలతో బాలుడు చికిత్స పొందుతున్నాడు. అయితే బాలుడి తండ్రి మాట్లాడుతూ తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని, చైనా మాంజాలతో పిల్లలు గాయాలు పాలు కాకుండా దృష్టిసారించాలని సూచించాడు.   ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/32229/