schedule Wednesday, September 09, 2026

విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి

calendar_today January 10, 2025
person dharshininews
విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి
విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి - పాత తాండూరులో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యుత్ షాక్ తో ఓ ఎద్దు మృత్యువాత పడింది. ఈ సంఘటన తాండూరు మున్సిపల్ పరిధిలో చోటు చేసుకుంది. బాధిత యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. పాత తాండూరుకు నారా సుదర్శన్ రెడ్డి వ్యవసాయం కోసం ఎద్దులను కొనుగోలు చేశారు. శుక్రవారం సాయంత్రం కాగ్నానది నుంచి వస్తుండగా మార్గ మద్యలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఓ ఎద్దుకు విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయింది. కాసేపటికే మృత్యువాత పడింది. అయితే విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఎలాంటి రక్షణ చర్యలు లేకపోవడంతో ఎద్దుకు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిందని స్థానికులు వాపోయారు. గత కొన్ని నెలల క్రితం రూ. 1లక్ష 10వేలకు జోడెద్దులను కొనుగోలు చేసినట్లు రైతు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఓ ఎద్దు మృతితో తనకు నష్టం జరిగిందని, తనకు పరిహారం అందించాలని కోరారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/32181/