schedule Thursday, September 03, 2026

ఎలక్ట్రిక్ వాహనాలదే హవా..!

calendar_today January 4, 2025
person dharshininews
ఎలక్ట్రిక్ వాహనాలదే హవా..!
ఎలక్ట్రిక్ వాహనాలదే హవా..! - అందరి చూపు ఈవీ మోటార్ల పైనే - చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి - తాండూరులో షోరూం సందర్శన తాండూరు, దర్శిని ప్రతినిధి : రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల హావా కొనసాగడం ఖాయమని చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు శేఖాపురం ఆంజనేయులు ఆధ్వర్యంలో తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఏర్పాటు చేసిన ఆంజనేయ ఆటో మోబైల్స్ ఫ్యూర్ ఎలక్ట్రిక్ వాహనాల షోరూంను ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సందర్శించారు. షోరూంలో ఏర్పాటు చేసిన వాహనాల అమ్మకాలను పరిశీలించారు. ఓ ఎలక్ట్రిక్ వాహనం నడిపి సందడి చేశారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మారుతున్న కాలంతో పాటు పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించని ఎలక్ట్రిక్ వాహనాల వాడకం రోజు రోజుకు పెరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల హావా కొనసాగడం ఖాయమన్నారు. ధనికుల నుంచి పేదల వరకు అందరి చూపు ఎలక్ట్రిక్ వాహనాల వైపే ఉందన్నారు. ముందు ముందు వాయు కాలుష్యం లేని భారతదేశం ఏర్పడాలని ఆకాంక్షించారు. అనంతరం ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని శేఖాపురం ఆంజనేయులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్, తాండూరు పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, బీఎస్ఎన్ఎల్ కమిటి సభ్యులు గాజుల శాంతుకుమార్, నేతలు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/31990/