schedule Thursday, September 03, 2026

బ్యాంకు అకౌంట్లు క్లోజ్ చేస్తున్న ఆర్బీఐ..!

calendar_today December 31, 2024
person dharshininews
బ్యాంకు అకౌంట్లు క్లోజ్ చేస్తున్న ఆర్బీఐ..!
బ్యాంకు అకౌంట్లు క్లోజ్ చేస్తున్న ఆర్బీఐ..! - మూడు రకాల ఖాతాలపై నిషేధం - రేపటి నుంచి అమలుకు చర్యలు - కొత్త సంవత్సరం సందర్భంగా నిర్ణయం దర్శిని డెస్క్ : బ్యాంకులో డబ్బులు దాచుకునేందుకు చాలా మంది ఖాతాలు తెరుచుకుంటారు. ఒక్కొక్కరు పలు బ్యాంకులలో అకౌంట్లు ఓపేన్‌ చేసుకుని ఉంటారు. వాటిలో ఎలాంటి లావాదేవిలు జరపకపోవడం వల్ల ఎవ్వరికి ఉపయోగం ఉండదు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1 అంటే రేపటి నుంచి కొన్ని బ్యాంకు ఖాతాలను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి, మోసాలను తగ్గించడానికి RBI తరచుగా చర్యలు తీసుకుంటుంది. ఈమేరకు మూడు రకాల బ్యాంకు ఖాతాలను మూసివేయాలని ఆర్బీఐ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. డోర్మాంట్ అకౌంట్లు, ఇన్ యాక్టివ్ ఖాతాలను మూసివేయాలని ఆర్బీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. రెండేళ్ల కంటే ఎక్కువ లావాదేవీలు లేని బ్యాంకు ఖాతాలను డోర్మాంట్ ఖాతాలుగా గుర్తిస్తారు. అలాంటి ఖాతాలు హ్యాకర్లకు సులభంగా మారతాయి. అక్రమ నగదు బదిలీకి ఈ ఖాతాలను ఉపయోగించే అవకాశం ఉంది. ఇంకా, ఒక సంవత్సరం పాటు ఎలాంటి లావాదేవీలు జరగని బ్యాంకు ఖాతాలను ఇన్‌యాక్టివ్ ఖాతాలుగా గుర్తిస్తారు. వీటిని కూడా అక్రమ ఆర్థిక కార్యకలాపాలకు దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. అలాంటి బ్యాంకు ఖాతాలను జనవరి 1 నుంచి మూసివేయవచ్చు. మరోవైపు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను తెరిచి ఉంటే, ఏదైనా ఒక ఖాతా నిష్క్రియంగా ఉండే అవకాశం ఉంది. అందుకే మీరు అవసరం లేని ఖాతాలను మూసివేయవచ్చు. లేదంటే మీ సాధారణ లావాదేవీల కోసం మీ ఖాతాలన్నింటినీ ఉపయోగించుకునేలా ప్లాన్ చేసుకోవడం మంచిది. దీంతో పాటు నిర్దిష్ట వ్యవధిలోపు బ్యాంకు ఖాతాలో జీరో బ్యాలెన్స్ ఉంటే, అటువంటి ఖాతాలను కూడా మూసివేయాలని RBI నిర్ణయించింది. ప్రజలు తమ బ్యాంకు ఖాతాలను సద్వినియోగం చేసుకునేందుకు ఆర్థిక లావాదేవీలను సులభతరం చేసేందుకు ఆర్‌బీఐ ఈ చర్య తీసుకుంది. మీ ఖాతా చాలా కాలం పాటు నిష్క్రియంగా ఉంటే అంటే అకౌంట్‌ వినియోగంలో లేకుంటే దాన్ని యాక్టివేట్ చేయవచ్చు. అందుకు బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. మళ్లీ KYC పత్రాలను సమర్పించాలి. ఖాతాలను క్లోజ్ చేసే విషయంలో ఆర్థిక అవకతవకలను నిరోధించడానికి, ఆధునికీకరణ, డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించడానికి ఈ చర్య తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/31859/