schedule Wednesday, September 09, 2026

విరుచుకుపడిన ఊర కుక్కలు..!

calendar_today December 23, 2024
person dharshininews
విరుచుకుపడిన ఊర కుక్కలు..!
విరుచుకుపడిన ఊర కుక్కలు..! - ఇంటి వద్ద ఉన్న మేకల, గొర్రె పిల్లలపై దాడి - యజమానికి తీవ్ర నష్టం, గాజీపూర్‌ గ్రామంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : మూగ జీవాలపై ఊర కుక్కలు విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో మేక పిల్లు, గొర్రె పిల్లలు మృత్యువాతకు గురయ్యాయి. ఈ సంఘటన తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బుద్దారం లక్ష్మప్ప జీవనోపాధి కోసం మేకలు, గొర్రెలను పెంచి పోషిస్తున్నారు. వాటి పోషణ ద్వారా ఉపాధి పొందుతున్నాడు. అయితే సోమవారం ఉదయం తన వద్ద ఉన్న మేకలు, గొర్రెలను మేత కోసం అడవికి తీసుకెళ్లాడు. ఇంటివద్ద చిన్నగా ఉన్న మేక పిల్లలు, గొర్రె పిల్లలను పాకలో వదిలేసి వెళ్లాడు. పాకలో ఉన్న మేక పిల్లు, గొర్రె పిల్లలపై ఊర్లో తిరిగే కుక్కలు దాడికి తెగబడ్డాయి. విచక్షణ రహితంగా దాడి చేయడంతో 5మేక పిల్లలు, 2 గొర్రె పిల్లలు కేకలు వేస్తూ మృత్యువాత పడ్డాయి. మరి కొన్ని మేక, గొర్రె పిల్లు గాయాల పాలయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు దాడికి కారణమైన ఓ కుక్కను దాడి చేసి హతమార్చినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనతో బాధిత కుటుంభీకులు కంట కన్నీరు పెట్టారు. తమను ప్రభుత్వం, సంఘాల నాయకులు ఆదుకోవాలని కోరారు. ఊర్లో కుక్కలు దాడి చేయడం పట్ల గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఊర కుక్కల నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/31633/