schedule Thursday, September 03, 2026

మెంతిలో ఆరోగ్యం మెండు

calendar_today July 8, 2024
person dharshininews
మెంతిలో ఆరోగ్యం మెండు
మెంతిలో ఆరోగ్యం మెండు - రెగ్యులర్‌గా తీసుకుంటే పోషకాలు - గుండె, ఒత్తిడి సమస్యలపై మంచి ప్రభావం దర్శిని డెస్క్ : నేటి ఆదునిక జీవితంలో గుండె సమస్యలు, ఒత్తిడి సమస్యలు అధికంగా వెంటాడుతుంటాయి. ఈ సమస్యలతో శరీర ఆరోగ్యంపై పడే ప్రమాదాన్ని మన ప్రకృతి నుంచి లభించే మెంతి ఆకుల నుంచి దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే మెంతి ఆకులను నమలడం వల్ల మేలు జరుగుతుంది. మెంతి ఆకుల్లోనే కాదు గింజల గింజలలో కూడా ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఉన్నాయి. ఆకు కూరల్లో విటమిన్లు ఎ, సి, ఇ, బి-కాంప్లెక్స్, కాల్షియం, పొటాషియం, ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. రెగ్యులర్ వినియోగంతో మన శరీరం పోషకాలను పొందుతుంది. రోగ నిరోధక శక్తి పెంపు మెంతి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే శరీరం వ్యాధులతో సరిగ్గా పోరాడగలదు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో మెంతి ఆకులను నమలడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె ప్రమాదాలపై ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం గుండె చప్పుడును అదుపులో ఉంచుతాయి. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మెంతి ఆకుల్లో పీచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణవ్యవస్థ కూడా బాగుంటుంది. జీర్ణ, చర్మ సమస్యలపై ఇది మలబద్ధకం, ఇతర జీర్ణ సంబంధిత వ్యాధులను కూడా నివారిస్తుంది. ఈ ఆకులో విటమిన్ ఎ, ఇ ఎక్కువగా ఉంటాయి. ఇది చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది చర్మపు చికాకును కూడా తగ్గిస్తుంది. మెంతి ఆకులు జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి. ఇది బరువును అదుపులో ఉంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. శరీరంలో శక్తి పెరుగుతుంది. మానసిక ఆరోగ్యం ఈ ఆకులు మానసిక ఆరోగ్యానికి కూడా మంచివి . దీని పదార్థాలు ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఇది యాంటీఆక్సిడెంట్ లక్షణాల వల్ల శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. అనేక వ్యాధులను నివారిస్తుంది. (నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.) https://www.dharshininews.com/27605/