schedule Thursday, September 03, 2026

టీయూడబ్ల్యూజే ఐజేయూలో ఉమ్మడి జిల్లాకు అగ్రతాంబూలం

calendar_today June 20, 2024
person dharshininews
టీయూడబ్ల్యూజే ఐజేయూలో ఉమ్మడి జిల్లాకు అగ్రతాంబూలం
chai jrటీయూడబ్ల్యూజే ఐజేయూలో ఉమ్మడి జిల్లాకు అగ్రతాంబూలం - రాష్ట్ర అధ్యక్షులుగా విరహత్‌ అలీ, కార్యదర్శిగా కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి - శుభాకాంక్షలు తెలిపిన జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చారి వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి : టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర కార్యవర్గంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు అగ్రతాంబూలం అందింది. రాష్ట్ర అధ్యక్షులుగా విరహత్ అలీ, కార్యదర్శిగా కొంపల్లి శ్రీకాంత్‌ రెడ్డిలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే ఐజేయూ వికారాబాద్‌ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చారి హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర మహసభలు జరుగుతున్నాయి. గురువారం జరిగిన సమావేశంలో ఐజేయూ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులుగా విరహాత్ అలీ, కార్యదర్శిగా కొంపల్లి శ్రీకాంత్‌ రెడ్డిలను ఎన్నుకున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి వారికి కీలక పదవులు దక్కడం పట్ల వికారాబాద్‌ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఫకిరప్పలు వారికి పుష్పగుచ్చం అందించి శుభకాంక్షలు తెలిపారు. శాలుతాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27306/