schedule Thursday, September 03, 2026

ఓటమిని అంగీకరిస్తున్నా..!

calendar_today June 4, 2024
person dharshininews
ఓటమిని అంగీకరిస్తున్నా..!
chai jrఓటమిని అంగీకరిస్తున్నా..! - బీజేపీ గాలి వీయడంతో ఓటమి - కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు - కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : చేవేళ్ల లోక్ సభ ఎన్నికల్లో తన ఓటమిని అంగీకరిస్తున్నట్లు కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ప్రకటించారు. తన ఓటమికి తనదే నైతిక బాధ్యత అంటూ చెప్పుకొచ్చారు. చేవేళ్ల పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠంగా కొనసాగింది. ఫలితాల్లో బీజేపీకి ఆధిక్యం లభించడంతో కౌంటింగ్‌ హాల్ నుంచి రంజిత్ రెడ్డి బయటకు వచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపొందిన కొండా విశ్వేశ్వర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. చేవేళ్లలో బీజేపీ గాలి వీయడంతో తాను ఓడిపోయానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు విస్తృతంగా పనిచేసినా కమలం వేవ్‌ వల్ల ఓటమి చెందామన్నారు. తన ఓటమిలో అనేక కారణాలు ఉన్నా అన్నింటికి నైతిక బాధ్యత తనదే అని చెప్పుకొచ్చారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26959/