schedule Thursday, September 03, 2026

మున్సిపల్ వాసులకు గుడ్ న్యూస్..!

calendar_today February 29, 2024
person dharshininews
మున్సిపల్ వాసులకు గుడ్ న్యూస్..!
మున్సిపల్ వాసులకు గుడ్ న్యూస్..! - ఆస్తిపన్ను బకాయిపై 90శాతం వడ్డీ రాయితీ - ప్రకటించిన మున్సిపల్ శాఖ తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ పరిధిలోని ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆస్తిపన్ను బకాయి చెల్లింపులో వడ్డీపై 90 శాతం రాయితీ కల్పించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు సీడీఎంఏ అధికారులు ప్రకటన జారీ చేశారు. ఆస్తి పన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ రాయితీ అందిస్తూ ఓటీఎస్‌(వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌) స్కీంను అందుబాటులోకి తీసుకవస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో 2023 సంవత్సరానికి బకాయి ఉన్న వారంతా తక్షణమే 10 శాతం వడ్డీతో మాత్రమే బకాయిలు క్లియర్‌ చేసుకునే అవకాశం కల్పించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం మార్చి 31లోపు ఆస్తి పన్ను బకాయిదారులకు ఈ ఓటీఎస్‌ స్కీం వర్తించనున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎవరైనా చెల్లించిన పక్షంలో ఆ 90 శాతం వడ్డీ రాయితీ మొత్తాన్ని తరవాత సంవత్సరం చెల్లించాల్సిన ఆస్తి పన్నులో సర్దుబాటు చేస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వడ్డీ రాయితీ అవకాశాన్ని మున్సిపల్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/24228/