schedule Sunday, July 05, 2026

ఆర్టీసీ ప్రయాణికుడి జేబుకు కన్నం..!

calendar_today February 16, 2024
person dharshininews
ఆర్టీసీ ప్రయాణికుడి జేబుకు కన్నం..!
ఆర్టీసీ ప్రయాణికుడి జేబుకు కన్నం..! - బస్సు ఎక్కుతుండగా రూ.49వేలు చోరీ - పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆర్టీసీ బస్సు ఎక్కే క్రమంలో ప్రయాణికుడి నుంచి గుర్తుతెలియని వ్యక్తులు డబ్బులు చోరీ చేశారు. ఈ సంఘటన తాండూరు ఆర్టీసీ డీపోలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. బాధితుడుతు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం చించొల్లికి చెందిన నారా నాగప్ప హైదరాబాద్ లో నివసిస్తున్నాడు. తన తండ్రి. సొంత ఊళ్లో భూమి పట్టా చేయిస్తానని చెప్పడంతో ఆ పనిమీద శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి తాండూరు మీదుగా చించొల్లి వెళ్లాడు. అక్కడ సంతకాలు చేసి.. 'చించొల్లిలోని ఎస్బీఐ బ్యాంకులో ఎస్ఐసీకి సంబంధించిన రూ.49వేలను డ్రా చేసుకున్నాడు. అనంతరం తాండూరుకు బస్సులో చేరుకున్నాడు. మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో హైదరాబాద్ వెళ్లేందుకు బస్సు ఎక్కుతుండగా ఒకేసారి ప్రయాణికులు తోసుకోవడంతో జేబులో డబ్బులు కనిపించలేదు. దీంతో వెంటనే తాండూరు పట్టణ పోలీస్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయాలని కోరాడు. ఈ సంఘటన గురించి తెలిసిన వారు నాగప్పపై సానుభూతి తెలిపారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/23921/