schedule Sunday, July 05, 2026

చేపల వేటకు వెళ్లి..!

calendar_today January 19, 2024
person dharshininews
చేపల వేటకు వెళ్లి..!
చేపల వేటకు వెళ్లి..! - గల్లంతైన వ్యక్తి మృతి - పెద్దేముల్‌ మండలంలో విషాదం తాండూరు, దర్శిని ప్రతినిధి : చేపల వేటకు చెరువులోకి వెళ్లి ఓ వ్యక్తి గల్లంతై మృతి చెందాడు. శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన పెద్దేముల్ మండలం మంబాపూర్‌లో విషాధం నిపింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పెద్దేముల్ మండలం మాంబపూర్ గ్రామానికి చెందిన గోకరి రాములు అనే వ్యక్తి గురువారం తోటి గ్రామస్తులతో కలిసి గ్రామంలోని చెరువులోకి చేపల కోసం వెళ్లారు. చేపల కోసం చెరువులోకి దిగిన గోకరి రాములు ప్రమాద వశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. రాత్రయినా ఆచూకీ లభించలేదు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో శుక్రవారం గలింపు చర్యలు ముమ్మరం చేసి మృత దేహాన్ని బైటికి తీశారు. రాములు మృతి చెందడంతో కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23291/