schedule Friday, September 11, 2026

యూటర్న్ డెత్..!

calendar_today December 31, 2023
person dharshininews
యూటర్న్ డెత్..!
యూటర్న్ డెత్..! - రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం - సిమెంట్ ట్యాంకర్, బైక్ ఢీ - తాండూరు ఆర్జీకే వద్ద ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి: రోడ్డు మార్గంలో ఉండే యూటర్న్ దాటిన తరువాత జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి తాండూరు పట్టణం రాజీవ్ గృహ కల్ప కాలనీ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు పట్టణం ఇందిరా నగర్ ప్రాంతానికి చెందిన మోబిన్ అనే యువకుడు బైక్ పై రాజీవ్ కాలనీ నుంచి తాండూరు పట్టణంవైపు వస్తున్నాడు.   యూటర్న్ తీసుకుని వచ్చే క్రమంలో అదే మార్గంలో వేగంగా వస్తున్న సిమెంట్ ట్యాంకర్ అదుపుతప్పి బైక్ ను ఢీ కొట్టింది. దీంతో బైక్ పై ఉన్న మొబిన్ కు రక్త గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఏడాది చివరి రోజు యువకుడు దుర్మరణం కావడంతో వారి కుటుంబంలో విషాదం నింపింది.   ఇదికూడా చదవండి...  https://dharshininews.com/22866/