ఆర్టీసీ బస్సులో కండక్టర్ రుబాబు
December 10, 2023
dharshininews
ఆర్టీసీ బస్సులో కండక్టర్ రుబాబు
- మహిళ నుంచి టికెట్ డబ్బులు వసూలు
- సస్పెండ్ చేసిన ఆర్టీసీ అధికారులు
- అమలులోకి వచ్చిన రెండో రోజే సంఘటన
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: ప్రీ అయితే నాకేంటీ.. బస్సు ఎక్కాకా లేడీసీ అయినా కూడా టిక్కెట్ తీసుకోవాల్సిందే అంటూ ఓ కండక్టర్ రుబాబు చేశాడు. విషయం తెలిసిన ఆర్టీసీ అధికారులు వెంటనే అతన్ని విధుల్లో నుంచి తొలగించారు. అయితే నిజాబాద్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే..
నిజామాబాద్ జిల్లా బోధన్ డిపో పరిధిలో టీఎస్‌ఆర్టీసీ బస్సు కండక్టర్ నర్సింహులు ఒక మహిళకు టికెట్ జారీ చేశాడు. బస్సులలో ఉచిత ప్రయాణం సౌలభ్యం ఉన్నా లెక్కచేయకుండా, ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని తీసుకొచ్చిందని వాదించినా సరే ఏమాత్రం పట్టించుకోలేదు.
టికెట్ ఇచ్చి మహిళా ప్రయాణికురాలి నుంచి రూ.90 ఛార్జీ వసూలు చేశాడు. ఓ ప్రయాణికుడు గమనించి కండక్టర్ నిర్వాకాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో కాస్తా తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దాకా వెళ్లింది. వెంటనే స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. కండక్టర్‌ను డిపో స్పేర్‌లో ఉంచామని, ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు. విచారణ తర్వాత శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎండీ సజ్జనార్ తెలిపారు. మరోవైపు సదరు కండక్టర్‌ను విధుల నుంచి తప్పించినట్లు ఆర్ఎం జానిరెడ్డి మీడియాకు తెలిపారు. ఉచిత ప్రయాణం అమలులోకి వచ్చిన రెండో రోజే ఆర్టీసీ బస్ కండక్టర్ మహిళ వద్ద డబ్బులు వసూలు చేసి, టికెట్ ఇవ్వడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో కూడా వీడియో వైరల్ అయ్యింది.
ఇది కూడా చదవండి...
https://dharshininews.com/22651/