schedule Thursday, September 03, 2026

వ‌ర్షాల‌తో అప్రమత్తంగా ఉండాలి : జిల్లా ఎస్పీ నారాయ‌ణ‌

calendar_today September 27, 2021
person dharshininews
వ‌ర్షాల‌తో అప్రమత్తంగా ఉండాలి : జిల్లా ఎస్పీ నారాయ‌ణ‌
వ‌ర్షాల‌తో అప్రమత్తంగా ఉండాలి - స‌మ‌స్య‌లుంటే 100కు కాల్ చేయండి - వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయ‌ణ‌ వికారాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: భారీ వర్షాల నేప‌థ్యంలో వికారాబాద్ జిల్లా ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జిల్లా ఎస్పీ నారాయ‌ణ సూచించారు. రెండు రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని జిల్లా ఎస్పీ నేరుగా ప్ర‌జ‌ల‌కు సూచ‌న‌లు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో వాగు దాటే ప్రయత్నం చేయొద్దన్నారు. పాడుబడ్డ ఇళ్లల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాల‌కు వెళ్లాల‌న్నారు. ఎక్కడ ఏమైనా ఇబ్బంది, ఆప‌ద వ‌చ్చినా డయల్ 100 కి ఫోన్ చేయాలని సూచించారు. మ‌రోవైపు గ్రామాల్లో ఉన్న యువత మీ అనుసంధానం లో ఉన్న వాగుల పై నిఘా పెట్టాల‌న్నారు. ఏదైనా ప్రమాదవశాత్తు వాగు ప్రవహిస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారుల‌కు స‌మాచారం అందించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.