schedule Friday, September 11, 2026

వాగులోకి దూసుకెళ్లిన బైకు

calendar_today August 26, 2023
person dharshininews
వాగులోకి దూసుకెళ్లిన బైకు
వాగులోకి దూసుకెళ్లిన బైకు - బైకుతో పాటు పడిన యువకుడు - ధారూరు మండలంలో దారుణం వికారాబాద్, దర్శిని ప్రతినిధి: బైకుపై వెళుతున్న వ్యక్తి వాగులోకి దూసెకెళ్లాడు. బైకుతో పాటు వాగులో పడడంతో అక్కడే మృతి చెందాదు. ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లా ధారూరు మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దెముల్ మండలం కందనెల్లి గ్రామానికి చెందిన రాఘవేందర్ శనివారం ఉదయం బాచారం గేటు సమీపాన ఉన్న వాగు వద్ద బైక్ పై వెళ్తుండగా మూలమలుపులో బైకు అదుపు తప్పి వాగులో పడి మృతి చెందాడు. బైకుతో పాటు వాగులోకి దూసుకెళ్లడంతో బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుని వివరాలను ఆరా తీశారు. మరోవైపు వాగులో వ్యక్తి పడిపోయిన విషయం తెలుసుకున్న స్థానికులు భారీగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. బైకుతో పాటు వాగులో పడి వ్యక్తి మరణించడంతో సంఘటన కలకలరం రేపింది. ఇది కూడా చదవండి... https://dharshininews.com/19661