schedule Sunday, July 05, 2026

వాగులో వ్యక్తి గల్లంతు..!

calendar_today July 21, 2023
person dharshininews
వాగులో వ్యక్తి గల్లంతు..!
వాగులో వ్యక్తి గల్లంతు..! - సంగెంకలాన్‌లో కలకలం - గాలిస్తున్న పోలీసులు, గ్రామస్తులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : వాగులో ఓ వ్యక్తి గల్లంతు అయ్యాడు. ఈ సంఘటన తాండూరు మండలం సంగెంకలాన్‌లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బొక్తంపల్లి పెంటప్ప(48) శుక్రవారం ఉదయం కర్ణాటక రాష్ట్రం షాపూర్ లో బందువుల అంత్యక్రియల కోసం సుమారు 30తో కలిసి వెళ్లారు. అంత్యక్రియలు ముగించుకుని సాయంత్రం తరువాత గ్రామానికి తిరిగి వచ్చారు. అయితే గ్రామ సమీపంలోకి రాగానే భారీ వర్షాల కారణంగా వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో అందరు అక్కడే ఉన్న ఓ కల్లు దుకాణం వద్ద కూర్చున్నారు. కొద్ది సేపటి తరువాత పెంటప్ప గ్రామంలోకి వెళ్లేందుకు వాగు దాటే ప్రయత్నం చేశాడు. అటు వైపు, ఇటు వైపు ఉన్న గ్రామస్తులు వద్దని వారించిన పెంటప్ప వినకుండా ముందుకు సాగారు. కొద్ది దూరం వెళ్లాక వాగు ఉదృత ప్రవాహానికి పెంటప్ప కొట్టుకుపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. పెంటప్ప కొట్టుకుపోయిన వాగు గుండా గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వాగులో కొట్టుకుపోయిన పెంటప్పకు భార్య అమృతమ్మ, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న కరణ్ కోట్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిపై ఆరా తీశారు.     ఇది కూడా చదవండి... https://dharshininews.com/18735 chaithany collage