అదనపు వర్నకట్న వేధింపులకు బలి
July 21, 2023
dharshininews
అదనపు వర్నకట్న వేధింపులకు బలి
- ఆత్మహత్య చేసుకున్న యువతి
- కేసు నమోదు చేసిన పోలీసులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : అధిక వరకట్నం వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన తాండూరు మండలం అల్లాపూర్ గ్రామంలో జరిగింది. కరణ్ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని అల్లాపూర్ గ్రామానికి చెందిన బుర్ర లాలప్పకు మమత(27)తో కొన్నేళ్ల క్రితం వివాహాము జరిగింది. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి మమతను ఆమె భర్త లాలప్ప, అత్త యశోధ, ఆడపడుచులు అదనపు కట్నం కోసం వేధించసాగారు. దీంతో మనస్థాపం చెందిన మమత శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో దూళానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న కరణ్ కోట్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని మార్చురుకి తరలించారు. మృతురాలి తల్లి ఎన్నారం రాములమ్మ ఫిర్యాదు మేరకు భర్త లాలప్ప, అత్త యశోద, ఆడపడుచులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ ఐ మధుసూదన్ రెడ్డి తెలిపారు.
ఇది కూడా చదవండి...
https://dharshininews.com/18725