schedule Sunday, July 05, 2026

ట్రైనెక్కి టెన్షన్ పెట్టిన తాత..!

calendar_today July 21, 2023
person dharshininews
ట్రైనెక్కి టెన్షన్ పెట్టిన తాత..!
ట్రైనెక్కి టెన్షన్ పెట్టిన తాత..! - హై ఓల్టేజ్‌ వైరును పట్టుకునే యత్నం - రైలు ముందుకు సాగడంతో తప్పిన ప్రమాదం తాండూరు, దర్శిని ప్రతినిధి : స్టేషన్‌లో ఆగిన ట్రైన్‌ పైకి ఎక్కిన ఓ తాత స్థానికులను టెన్షన్ పెట్టాడు. ట్రైన్‌ పైన ఉన్న హై ఓల్టేజ్ వైర్లను పట్టుకునే ప్రయత్నం చేశాడు. వైరు తాకి తాకకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. మతిస్థిమితం సరిగ్గాలేని తాత చేసిన హల్‌ చల్ స్థానికులను కలవరపెట్టింది. ఈ సంఘటన శుక్రవారం తాండూరు రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు రైల్వే స్టేషన్ లో సాయంత్రం ఆగిన హుస్సేన్ సాగర్ రైలు ఇంజన్‌ పైకి కర్ణాటక రాష్ట్రం కల్లూరు గ్రామానికి చెందిన చంద్రశేఖర్(60) వృద్దుడు ఎక్కాడు. ఇంజన్ పై భాగంలో వేలాడుతున్న హై వోల్టేజ్ వైర్లలో ఒకదానిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. స్థానికులు గమనించిన హెచ్చరించారు. అదేసమయంలో ట్రైన్ ముందుకు సాగింది. ఈక్రమంలో హై ఓల్టేజ్ వైరు వృద్ధునికి తాకి తాకకనట్లు అయ్యింది. అప్పటికే తాతకు తీవ్ర గాయాలు అయ్యాయి. వైరు తాకకపోవడంతో తాతకు ప్రాణాపాయం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. తీవ్ర గాయాలపాలైన తాతను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా తాతకు మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో ఇలా ప్రవర్తించాడని గ్రామస్తులు తెలిపారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18722 chaithany collage