schedule Sunday, July 05, 2026

భారీ వర్షాలతో జాగ్రత్త..!

calendar_today July 18, 2023
person dharshininews
భారీ వర్షాలతో జాగ్రత్త..!
భారీ వర్షాలతో జాగ్రత్త..! - కూలీ పోయే ఇండ్లలో ఉండొద్దు - చెరువులు, వాగుల వద్దకు వెళ్లొద్దు - అత్యవసరమైతే పోలీసులను సంప్రదించాలి - కరణ్ కోట్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తంగా ఉండాలని తాండూరు మండలం కరణ్ కోట్ ఎస్ఐ మధు సూధన్ రెడ్డి సూచించారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం తాండూరు మండల ప్రజలకు ఎస్ఐ మధుసూధన్ రెడ్డి కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కూలీ పోయే ప్రమాదంలో ఉన్న ఇండ్లలో నివసించే ప్రజలు సురక్షిత నివాసాలకు తరలివెళ్లాలని అన్నారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలలో ఉండే ఇండ్లలోకి వర్షపునీరు చేరకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో పాటు గ్రామ సమీపంలోని చెరువులు, వాగుల వద్ద వెళ్లరాదని, పిల్లలు, యువకులు వెళ్లకుండా దృష్టిసారించాలన్నారు. ముఖ్యంగా విద్యుత్ స్థంబాల వద్దకు, ఇంట్లో ఎలక్ట్రిక్ వస్తువుల నుంచి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఉంటే పోలీసులకు సంప్రదించాలన్నారు. అత్యవసరమైన పరిస్థితులు ఏర్పడితే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18660 chaithany collage