schedule Sunday, July 05, 2026

సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలి

calendar_today July 18, 2023
person dharshininews
సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలి
సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలి - అమ్మాయిలను వేధిస్తే చర్యలు - కరణ్ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: విద్యార్థులు ఆన్ లైన్, సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని తాండూరు మండలం కరణ్ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం తాండూరు మండలం మల్కాపూర్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్ లైన్, సైబర్ నేరాలు ఎలా జరుగుతాయని, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఇతరులను ఎలా అప్రమత్తం చేయాలనే అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాలపై అవగాహన పెంచుకుని ఇతరులను చైతన్య పరచాలన్నారు. అదేవిధంగా అమ్మాయిలను, మహిళలను వేధిస్తే షీటీం ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. విద్యార్థులు చక్కగా చదువుకుని సన్మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18656 chaithany collage