schedule Sunday, July 05, 2026

పేద ఇంటిపై ఘోరం..!

calendar_today July 17, 2023
person dharshininews
పేద ఇంటిపై ఘోరం..!
పేద ఇంటిపై ఘోరం..! - ఇంటి పైకప్పు కూలి ప్రమాదం - తల్లీ, పిల్లలకు గాయాలు - పాత తాండూరులో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రమాద వశాత్తు జరిగిన ఓ సంఘటన పేదింటిలో ఘోరం సృష్టించారు. ఇంటి పైకప్పు కూలడంతో ఇంట్లో ఉన్న తల్లీ, పిల్లలు గాయాల పాలయ్యారు. ఈ సంఘటన తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూర్ రైల్వే గేట్ సమీపంలో అంబేద్కర్ నగర్‌లో నీరటి నరసింహులు అనే వ్యక్తికి చెందిన ఇంట్లో నరసమ్మ (39), ఆమె పిల్లలతో నందిని (10), మనోహర్(12), నిరంజన్(08), దినేష్ (2)లతో కలసి గత కొన్ని సంవత్సాలుగా నివాసం ఉంటున్నారు. వారు నివసిస్తున్న ఇళ్లు మాల బండలతో ఉంది. చాలా రోజులుగా వారు ఉంటున్న ఇల్లు ఓవైపు పాక్షికంగా శిధిలంగా మారింది. ఇటీవల కురిసిన వర్షానికి మధ్యాహ్నం ఇంటి పై కప్పు మరింత శిథిలంగా మారడంతో సోమవారం పైకప్పు కూలిపోయింది. అప్పటికే ఇంట్లో నిద్రిస్తున్న నర్సమ్మ (39) కాళ్లపై పడిపోయింది. ఇంట్లోనే ఉన్న ఇద్దరి పిల్లలు తలకు, చేతులకు, విపు భాగంలో స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు నరసమ్మను, ఆమె పిల్లలను చికిత్స నిమిత్తం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి ఆంబులెన్స్ లో తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్ శోభారాణి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరోవైపు జరిగిన ప్రమాదంపై మున్సిపల్ అధికారులు, పోలీసులు స్పందిస్తూ ప్రస్తుత వర్షాకాలంలో శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఎవ్వరు ఉండరాదని సూచించారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18629 chaithany collage