schedule Saturday, September 12, 2026

విద్యుత్ వైరు పట్టుకుని వ్యక్తి ఆత్మహత్య

calendar_today July 17, 2023
person dharshininews
విద్యుత్ వైరు పట్టుకుని వ్యక్తి ఆత్మహత్య
విద్యుత్ వైరు పట్టుకుని వ్యక్తి ఆత్మహత్య - భార్య కాపురానికి రావడంలేదని చర్య - వివరాలు వెల్లడించిన కరణ్ కోట్ ఎస్ఐ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఉన్న విద్యుత్ వైరును పట్టుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన సోమవారం తాండూరు మండలం గౌతాపూర్ లో చోటు చేసుకుంది. కరణ్ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మండలం గౌతాపూర్ గ్రామానికి చెందిన ఎండి అబ్దుల్ జబ్బార్ (54) కర్ణాటక రాష్ట్రం చితాపూర్ తాలూకాలోని గావూరులో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. నాలుగు రోజుల క్రితం భార్యతో గొడవ పడి తాండూరు మండలం గౌతాపూర్ లో ఉంటున్న తమ్ముడు గౌస్ వద్దకు వచ్చాడు. తన భార్య తనతో పాటు సంసారానికి రావడం లేదని మనస్తాపం చెందాడు. ఈక్రమంలో సోమవారం ఉదయం అబ్దుల్ ఖాన్ పాలిషింగ్ యూనిట్ వద్ద ఉన్న ట్రాన్స్ ఫార్మర్ వద్ద కరెంట్ వైర్ పట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని తమ్ముడు గౌస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ మధుసూధన్ రెడ్డి తెలిపారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18619 chaithany collage