కూరగాయల దుకాణంలో చోరీ
July 16, 2023
dharshininews
కూరగాయల దుకాణంలో చోరీ
- గల్లా పెట్టేలోని డబ్బులు అపరహణ
- పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడి వెల్లడి
తాండూరు, దర్శిని ప్రతినిధి : కూరగాయల దుకాణంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. దుకాణంలోని గల్లా పెట్టేలో ఉంచిన డబ్బులను అపహరించారు. ఈ సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మండలం అంతారం అనుబంధ గ్రామం దస్తగిరిపేట్ గ్రామానికి చెందిన జావిద్ తన స్నేహితులతో కలిసి తాండూరు పట్టణంలోని కూరగాయల మార్కెట్ లో దుకాణం నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి వర్షం కురవడంతో 9 గంటలకే దుకాణం మూసి ఇంటికి వెళ్లాడు. ఆదివారం ఉదయం దుకాణం తెరిచేందుకు వచ్చాడు. అప్పటికే దుకాణంలో ఉన్న కూరగాయలపై కప్పిన కవర్లు తొలగి ఉండడంతో అనుమానంతో లోనికి వెళ్లి పరిశీలించాడు. శనివారం ఉదయం నుంచి నిర్వహించిన వ్యాపారంతో వచ్చిన గల్లా పెట్టేలో దాచిన సుమారు రూ. 10 వేలు కనిపించలేదు. దీంతో చోరీ జరిగిందని నిర్ధారించుకున్నాడు. చోరీ ఘటనపై తాండూరు పట్టణ పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేసినట్లు జావిద్ విలేకరులతో తెలిపాడు.
ఇది కూడా చదవండి...
https://dharshininews.com/18599