schedule Sunday, July 05, 2026

అమ్మాయి మోసం చేసిందని..!

calendar_today July 13, 2023
person dharshininews
అమ్మాయి మోసం చేసిందని..!
అమ్మాయి మోసం చేసిందని..! - రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య - కలకలం రేపుతున్న సెల్ఫీ వీడియో - తాండూరు మండలం అల్లాపూర్‌లో విషాధం తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: అమ్మాయి మోసం చేసింది.. నాతోని అయిత లేదు.. అమ్మా, నాన్నాలను మంచిగా చూసుకో అన్నా.. అంటూ ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చావబోయే ముందు యువకుడు తీసుకున్న సెల్ఫీ వీడియో కలకలం రేపింది. శంకర్‌ప‌ల్లి రైల్వే స్టేషన్ పరిధిలో బుధ‌వారం జరిగిన సంగటన తాండూరు మండలం అల్లాపూర్‌ గ్రామంలో విషాదం నింపింది. వికారాబాద్ జిల్లా తాండూరు మండల పరిధిలోని అల్లాపూర్ గ్రామానికి చెందిన కురువ మహేష్(21) హైదరాబాద్ లోని నల్ల మల్లారెడ్డి కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్నాడు. తను ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని మనోవేధనకు గురయ్యాడు. జీవితంపై విరక్తి చెంది చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. తల్లిదండ్రులకు సెల్ఫీ వీడియో పంపి, రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన తాండూరు మండలం అల్లాపూర్‌లో విషాదం నింపింది. యువకుడు తీసుకున్న సెల్పీ వీడియో కింద ఉండి చూడండి.. [video width="640" height="352" mp4="https://dharshininews.com/wp-content/uploads/2023/07/WhatsApp-Video-2023-07-12-at-6.42.05-PM.mp4"][/video] ఇది కూడా చదవండి... https://dharshininews.com/18491 chaithany collage