schedule Sunday, July 05, 2026

సంతకాలు చేసి వెళ్లాల్సిందే.!

calendar_today July 4, 2023
person dharshininews
సంతకాలు చేసి వెళ్లాల్సిందే.!
సంతకాలు చేసి వెళ్లాల్సిందే.! - మున్సిపల్ కమీషనర్‌కు కార్మికుల సెగ - వాహనాన్ని అడ్డుకున్న కార్మికులు - ఎందుకోసం అడ్డుకున్నారంటే.? తాండూరు, దర్శిని ప్రతినిధి : సంతకాలు చేసేదాకా వెళ్లేది లేదని తాండూరు మున్సిపల్ కార్మికులు కమీషనర్‌ను అడ్డుకున్నారు. ఈ సంఘటన తాండూరు మున్సిపల్ కార్యాలయంలో కలకలం రేపింది. తాండూరు మున్సిపల్ కమీషనర్ గా కొనసాగుతున్న శంకర్ సింగ్ ను ఇటీవలే బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో మెప్మాలో పీడీగా పనిచేస్తున్న షఫీవుల్లాను నియమించింది. అయితే బదిలీ వేటు పడిన కమీషనర్ శంకర్ సింగ్ మున్సిపల్ లో కార్మికుల వేతనాల చెల్లింపులతో పాటు ట్రాక్టర్లు, ఆటోల డిజిల్ కేటాయింపు బిల్లులపై సంతకాలు చేయలేదని కార్మికులు తెలుసుకున్నారు. దీంతో మంగళవారం సాయంత్రం మున్సిపల్ మంచి వెళ్లిపోతున్న కమీషనర్ శంకర్ సింగ్ తో కార్మికులు, సిబ్బంది వాగ్వివాదానికి దిగారు. సంతకాలు చేసేది లేదని కమీషనర్‌ తేల్చేయడంతో కార్మికులు కమీషవర్ వాహనాన్ని అడ్డుకున్నారు. కమీషనర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంతకాలు చేయకుండా కమీషనర్ వెళ్లిపోతే కార్మికుల వేతనాల చెల్లింపుకు 15 రోజుల ఆలస్యం జరుగుతోందని, ముందే ఇంటి ఖర్చులు, పిల్లల స్కూల్‌ ఫీజు ఖర్చులతో ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు ఆవేధన వ్యక్తం చేశారు. దీంతో పాటు డిజిల్ బిల్లులపై సంతకాలు చేయకపోతే వాహనాలు కదిలే పరిస్థితి లేదని అన్నారు. సంతకాలు చేసేదాకా వెల్లనిచ్చేది లేదని పట్టుబడ్డారు. ఈ సంఘటన తాండూరు మున్సిపల్లో తీవ్ర కలకలం రేపింది. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18309 chaithany collage