schedule Sunday, July 05, 2026

భవనం నుంచి పడిన వలస కార్మికుడి

calendar_today June 19, 2023
person dharshininews
భవనం నుంచి పడిన వలస కార్మికుడి
భవనం నుంచి పడిన వలస కార్మికుడి - మృతి తాండూరులో రెండు రోజుల క్రితం ప్రమాదం - హైదరాబాద్లో చికిత్స పొందుతూ కన్నుమూత - వివరాలు వెల్లడించిన పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : భవనం పైనుంచి పడిపోయిన ఓ వలస కార్మికుడు మృతి చెందాడు. రెండు రోజుల క్రితం తాండూరు పట్టణంలో జరిగిన ప్రమాదంలో గాయపడిన అతను చికిత్స పొందుతూ కన్నుమూశాడు. సోమవారం తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ లోని ఓల్డ్ హఫీజ్ పేట్ ప్రాంతానికి చెందిన బి. పరుశురాం (32) సెంట్రింగ్ పనులు చేస్తూ జీవించేవాడు. అయితే కొన్ని రోజుల క్రితం నరేష్ అనే మేస్త్రీ వద్ద తాండూరు పట్టణంలో చేపట్టే భవన నిర్మాణ పనుల కోసం వచ్చాడు. పట్టణంలోని దేనా బ్యాంకు సమీపంలోని నెహ్రు గంజ్ ప్రాంతానికి చెందిన కైలాష్ అనే వ్యక్తి ఇంట్లో భవన నిర్మాణ పనులు చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం మొదటి అంతస్తులో పనిచేస్తుండగా ప్రమాద వశాత్తు పరుశురాం జారి కింద పడిపోయాడు. ఈక్రమంలో తలకు, చేతులకు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. తోటి కార్మికులు గమనించి తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరుశురాం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి వెల్లడించారు. మరోవైపు మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని తోటి కార్మికులు కోరుతున్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18004 chaithany collage