అక్రమ కేసులకు భయపడేదే లేదు
June 12, 2023
dharshininews
అక్రమ కేసులకు భయపడేదే లేదు
- ప్రజా సమస్యలపై పోరాటమే ధ్యేయం
- యూత్ కాంగ్రెస్, ఎన్ఎపియూఐ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అక్రమ కేసులు ఎన్నీ పెట్టినా భయపడేది లేదని యూత్ కాంగ్రెస్ తాండూరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్, ఎన్ఎస్ యూఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిత్ అనురాగ్ లు అన్నారు. గతంలో పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ ఆధ్వర్యంలో దర్నా చేపట్టారు. ఈ మేరకు తాండూరు పట్టణ పోలీసులు యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్, ఎన్ఎస్ యూఐ వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిత్ అనురాగ్ లతో పాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం తాండూరులోని న్యాయస్థానంలో వారు హాజరయ్యారు. కేసు విచారణ అనంతరం వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయడమే ధ్యేయమన్నారు. ఆక్రమ కేసులను ఎన్ని పెట్టినా భయపడి వెనక్కి తగ్గేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాతుల వెంకటయ్య, బాతుల భీం. ఎబినేజర్ లు ఉన్నారు.
ఇది కూడా చదవండి...
https://dharshininews.com/17808