schedule Sunday, July 05, 2026

వరి గడ్డికి మంటలు

calendar_today June 1, 2023
person dharshininews
వరి గడ్డికి మంటలు
వరి గడ్డికి మంటలు - 100 ఎకరాల వరకు వ్యాప్తి - కష్టపడి ఆర్పేసిన ఫైర్ సిబ్బంది - నష్టంపై ఆందోళన చెందిన రైతులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: పొలంలో నిల్వ ఉంచిన వరి గడ్డికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఒక పొలం నుంచి చుట్టుపక్కల ఉన్న దాదాపు 100 ఎకరాల వరకు ఉన్న పొలాలకు మంటలు వ్యాపించాయి. ఆయా పొలాల్లో ఉన్న వరి గడ్డి మొత్తం కాలి బూడిదయ్యింది. ఈ సంఘటన బుధవారం రాత్రి తాండూరు మండలం అంతారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ సమీపంలోని ఊరచెరువు కింద రైతులు వరిపోలాలను సాగుచేస్తుంటారు. ఈ సీజన్‌లో పంటలు పూర్తయి ధాన్యం బస్తాలు తరలించారు. మరికొంత మంది రైతుల ధాన్యం పొలాల్లోనే ఉండిపోయాయి. అయితే బుధవారం సాయంత్రం తరువాత గుర్తుతెలియని వ్యక్తులు పొలంలో ఉన్న వరిగడ్డికి నిప్పంటించారు. ఒక్కసారిగా చెలరేగిన మంటలు చుట్టుపక్కల పొలాలకు వ్యాపించాయి. అలా దాదాపు 100 ఎకరాల వరకు మంటలు విస్తరించాయి. అంతారం అనుబంధ గ్రామం దస్తగిరిపేట్ వరకు మంటలు వ్యాపించాయి. పెండా స్వామిదాస్ అనే రైతు ధాన్యం తరలించేందుకు గోనె సంచులు లేక పొలంలోనే సుమారు 200 బస్తాలు ఉంచారు. పొలాలకు మంటలు వ్యాప్తిస్తున్న విషయాన్ని స్థానిక ఎంపీటీసీ శాంతుకుమార్‌కు తెలపడంతో స్పందించిన ఆయన తాండూరు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఫైర్ ఆఫీసర్ నాగార్జున, సిబ్బంది గోపాల్, ఎండీ ఖాజా, సునీల్ కుమార్, శ్రీకాంత్ తదితరులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కష్టపడి మంటలపై నీళ్లు చల్లి ప్రమాదాన్ని అదుపు చేశారు. ధాన్యం బస్తాలను కాపడడం పట్ల రైతులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు కష్టపడి సాగుచేసిన వరి పొలంలో పశువుల కోసం ఉంచుకున్న గడ్డి అగ్గిపాలు కావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి... మహిళా సంఘాలకు గుడ్‌ న్యూస్‌ - రూ.15,037 కోట్ల రుణాలకు సర్కారు ఆమోదం - గత యేడాది కంటే రూ.2315 కోట్లు అధికం https://dharshininews.com/17490 chaithany collage