schedule Sunday, July 05, 2026

మూడు ఇసుక ట్రాక్టర్ల సీజ్..!

calendar_today May 31, 2023
person dharshininews
మూడు ఇసుక ట్రాక్టర్ల సీజ్..!
మూడు ఇసుక ట్రాక్టర్ల సీజ్..! - కేసు నమోదు చేసిన కరణ్ కోట్ పోలీసులు - వివరాలు వెల్లడించిన ఎస్ఐ మధుసూధన్ రెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను కరణ్ కోట్ పోలీసులు సీజ్ చేశారు. ఈ మేరకు ట్రాక్టర్ డ్రైవర్లపై కేసు నమోదు చేశారు. బుధవారం కరణ్ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డి ఓ ప్రకటనలో కేసు వివరాలను వెల్లడించారు. తాండూరు మండలం గోనూర్ గ్రామ శివారు నుంచి బుధవారం తెల్లవారు జామున ట్రాక్టర్(టీఎస్ 34 సీటీఆర్ 7757) ద్వారా డ్రైవర్ అనంతప్ప అనే వ్యక్తి అక్రమంగా ఇసుక తరలిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అడ్డుకుని ట్రాక్టర్ ను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా రెండు రోజుల క్రితం తాండూరు మండలం వీర్ శెట్టి పల్లి గ్రామ శివారులో గుడిసే నర్సింలు ట్రాక్టర్(టీఎస్ 34 ఈ 4030) ద్వారా, అదే గ్రామానికి చెందిన యాలాల నరేష్ అనే వ్యక్తి కూడా ట్రాక్టర్ (టీఎస్ 34 బీటీఆర్ 8430) ద్వారా ఇసుక తరలిస్తుండగా అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ మూడు ట్రాక్టర్లను సీజ్ చేసి డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మధుసూధన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. ఇది కూడా చదవండి... డెడ్‌ బాడీపై అఘోరా పూజలు - స్నేహితుడి అంత్యక్రియల్లో ఘటన https://dharshininews.com/17476 chaithany collage