schedule Sunday, July 05, 2026

జూ.పంచాయతీ సెక్రటరీ ఆత్మహత్య

calendar_today May 12, 2023
person dharshininews
జూ.పంచాయతీ సెక్రటరీ ఆత్మహత్య
జూ.పంచాయతీ సెక్రటరీ ఆత్మహత్య - పురుగుల మందు సేవించడంతో మృతి - వరంగల్‌ జిల్లాలో దారుణం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని ఖానాపూర్ మండల్ రంగాపురంలో జూనియర్ పంచాయతీ సెక్రెటరీ రంగు సోనీ ఆత్మహత్యచేసుకుంది. రంగాపురం కార్యాలయంలో పురుగుల మందు తాగిన ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే మృతి చెందింది. గత కొన్ని రోజులుగా తమను రెగ్యులరైజ్ చేయాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. రెండుమూడు రోజుల క్రితం జూనియర్ పంచాయతీ సెక్రటరీలు అందరూ విధుల్లోకి తప్పనిసరిగా రావాలని ప్రభుత్వం ఆదేశించినప్పటి నుంచి ఆమె విధుల్లో చేరింది. ఆమె ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి... హాఫ్ షర్ట్, టీ షర్టుతో బైకు నడిపితే..! - వాహనదారులకు ట్రాఫిక్ చలాన్లు - కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుందంటే..? https://dharshininews.com/17144