schedule Sunday, September 06, 2026

అమెరికాలో తెలుగమ్మాయి కన్నుమూత

calendar_today May 8, 2023
person dharshininews
అమెరికాలో తెలుగమ్మాయి కన్నుమూత
అమెరికాలో తెలుగమ్మాయి కన్నుమూత - కాల్పుల్లో మృతి చెందిన యువతి - దుండగుడిని కాల్చి చంపిన పోలీసులు దర్శిని డెస్క్‌: అమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలుగు అమ్మాయి మృతి చెందింది. టెక్సాస్‌లోని డాలస్‌కు ఉత్తరాన 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలెన్‌ ప్రీమియర్‌ దుకాణ సముదాయంలో నల్ల రంగు కారులో వచ్చిన దుండగుడు.. దుకాణాల బయటి నుంచే కాల్పులు జరిపాడు. శనివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో జరిగిన ఘటనలో ఈ దుర్ఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన తాటికొండ ఐశ్వర్య కూడా మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఐశ్వర్య తండ్రి నర్సిరెడ్డి రంగారెడ్డి జిల్లా కోర్టులో జడ్జిగా పని చేస్తున్నారు. ఐశ్వర్య మృతితో కొత్తపేటలోని ఆమె నివాసం వద్ద విషాదం నెలకొంది. కాల్పుల సమయంలో వందల మంది బయటకు పరుగెత్తిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. కొంత మంది భయపడి అక్కడే దాక్కున్నారు. పోలీసులు వచ్చి దుకాణ సముదాయమంతా తనిఖీలు చేసిన తర్వాత ఇళ్లకు వెళ్లారు. అంతకుముందే సంఘటన స్థలానికి చేరుకున్న చేరుకున్న పోలీసులు.. దుండగుడిని కాల్చి చంపారు. ఇవి కూడా చదవండి.. పైలెట్ పెద్ద మనసు..! - మైనార్టీల కోసం రూ. 7.31 కోట్లు కేటాయింపు - నిధుల మంజూరు ఘనత ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి - కృతజ్ఞతలు తెలిపిన అఫ్పూ(నయూం) https://dharshininews.com/16983