schedule Saturday, September 12, 2026

మిస్ అయిన మోబైల్ ట్రేస్ అయ్యింది

calendar_today May 7, 2023
person dharshininews
మిస్ అయిన మోబైల్ ట్రేస్ అయ్యింది
మిస్ అయిన మోబైల్ ట్రేస్ అయ్యింది - వినియోగదారుని అందించిన పోలీసులు - సీఈఐఆర్‌ను సద్వినియోగం చేసుకోవాలి - కరణ్ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : వినియోగదారుడు నుంచి మిస్సైన మోబైల్ ఫోన్ ను ట్రేప్ చేసి అప్పగించారు. ఈ సంఘటన తాండూరు మండలం కరణ్ కోట్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కరణ్ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కరణ్ కోట్ గ్రామానికి చెందిన తిరుమల శ్రీనివాస్ గత నెల 29న సాయంత్రం కరస్ కోట్ కాలనీలో ఎక్కడో పోగొట్టుకున్నారు. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో అదే రోజు కరణ్ కోట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సీఈఐఆర్ వ్యవస్థలో ఫోన్ వివరాలను నమోదు చేశారు. మిస్సైనా మోబైల్ ను ట్రేస్ చేసి కనిపెట్టారు. ఆదివారం ఎస్ఐ మధుసూధన్ రెడ్డి చేతుల మీదుగా వినియోగదారుడు తిరుమల శ్రీనివాస్ కు ఫోన్‌ను అందజేశారు. ఈ సందర్భంగా వినియోగదారుడు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎస్ఐ మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ ఎవరైనా ఫోన్ పోగొట్టుకున్నా లేదా చోరీ అయినట్లు తెలిస్తే సీఈఐఆర్ ద్వారా నమోదు చేసుకుని ఫిర్యాదు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఫోన్ లను ట్రేస్ చేసి అప్పగిస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇవి కూడా చదవండి... రైతులకు గుడ్‌న్యూస్.. - రూ.18 లక్షలు అందించనున్న కేంద్రం - ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..? https://dharshininews.com/16953