schedule Friday, September 11, 2026

తాండూరు నాపరాతి పరిశ్రమను కాపాడాలి

calendar_today September 11, 2026
person dharshininews
తాండూరు నాపరాతి పరిశ్రమను కాపాడాలి
తాండూరు నాపరాతి పరిశ్రమను కాపాడాలి - ట్రక్ పార్కింగ్‌కు 18 ఎకరాలు ఎకరాలు కేటాయించాలి - ఆటో మోబైల్ రంగానికి 10 ఎకరాలు ఇవ్వాలి - అసెంబ్లీలో గళమెత్తిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని నాపరాతి పరిశ్రమను కాపాండేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అసెంబ్లీలో కోరారు. శుక్రవారం జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ కొత్తగా వెలుగులోకి వస్తున్న టైల్స్‌ వంటి పరిశ్రమలతో తాండూరు రాతి పరిశ్రమకు పోటీ పెరుగుతోందని, పరిశ్రమను నిలబెట్టేందుకు ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. తాండూరు రాతి పరిశ్రమపై ఆధారపడి వేలాది మంది కార్మికులు, వ్యాపారులు, రవాణా రంగానికి చెందిన వారు జీవనం సాగిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ట్రక్‌ పార్కింగ్‌ కోసం కేటాయించిన 18 ఎకరాలు, ఆటోమొబైల్‌ రంగానికి కేటాయించిన 10 ఎకరాలను వెంటనే కేటాయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇందుకు మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ క్వారీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి, తాండూరు రాతి పరిశ్రమను ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అసెంబ్లీలో పరిశ్రమ సమస్యను ప్రస్తావించడంతో తాండూరు క్వారీ అసోసియేషన్, వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. https://www.dharshininews.com/44645/