schedule Saturday, September 12, 2026

సెల్‌ ఫోన్‌ చోరీ కేసులను చేధిస్తాం

calendar_today April 19, 2023
person dharshininews
సెల్‌ ఫోన్‌ చోరీ కేసులను చేధిస్తాం
సెల్‌ ఫోన్‌ చోరీ కేసులను చేధిస్తాం - పోగొట్టుకున్న, చోరీ అయినా ఫిర్యాదు చేయండి - కరణ్‌ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: సెల్‌ ఫోన్‌ చోరీ, మోబైల్‌ మిస్సింగ్ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తాండూరు మండలం కరణ్‌ కోట్ పోలీస్టేషన్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోన్న సాంకేతిక సాయంతో సెల్‌ ఫోన్ చోరీ లేదా పోగొట్టుకున్న కేసుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు పోలీస్టేషన్లలో సెల్‌ ఫోన్ చోరీ, మిస్సింగ్ కేసులపై ఫిర్యాదులను స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ మధ్యకాలంలో ఎవరైనా ఫోన్లు పోగొట్టుకున్న లేదా ఎవరు అయిన గుర్తు తెలియని వ్యక్తులు అపహారించినట్లు తెలిస్తే బాధితులు పోలీస్టేషన్లలో ఫిర్యాదు చేయొచ్చన్నారు. కాని బాధితులు పోయిన ఫోన్‌కు సంబంధించిన ఐఎమ్ఈఐ నెంబర్లతో రావాలని సూచించారు. పోగొట్టుకున్న, పోయిన ఫోన్‌ల కేసులను పరిష్కరిస్తామన్నారు.