schedule Sunday, September 13, 2026

లారీ చోరీ..!

calendar_today March 19, 2023
person dharshininews
లారీ చోరీ..!
లారీ చోరీ..! - అపహరించిన గుర్తుతెలియని వ్యక్తులు - తాండూరు పట్టణ పోలీస్టేషన్‌లో కేసు నమోదు తాండూరు, దర్శిని ప్రతినిధి: పార్కింగ్ చేసిన లారీని చోరీ చేసిన సంఘటన తాండూరు పట్టణ పోలీస్టేషన్‌ పరిధిలో జరిగింది. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు అసోసియేషన్‌కు చెందిన నర్సింహారెడ్డి లారీ(TS 08 UA 6359)ను శనివారం రాత్రి తాండూరులో పార్కింగ్‌ చేసి ఉంచారు. అర్దరాత్రి 1-45 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు లారీని అపరహించుకుపోయారు. ఆదివారం ఉదయం గమనించిన యజమాని నర్సింహారెడ్డి లారీ ఆచూకీ కోసం గాలించిన ఫలితం లేకుండా పోయింది. చోరీకి గురైన లారీ రూ. 18 లక్షలు ఉంటుందని సమాచారం. దీంతో యజమాని నర్సింహారెడ్డి తాండూరు పట్టణ పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు.