schedule Sunday, July 05, 2026

 టీచర్ చేతివాటం వల్ల విద్యార్థి మృతి

calendar_today March 4, 2023
person dharshininews
 టీచర్ చేతివాటం వల్ల విద్యార్థి మృతి
 టీచర్ చేతివాటం వల్ల విద్యార్థి మృతి - వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలంలో ఘటన వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి: ఉపాధ్యాయుడు చేసిన దండన వల్ల ఓ ఘోరం జరిగిపోయింది. ఆ టీచర్ చేతివాటంలో దెబ్బలు తిన్న మూడో తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం చిలాపూర్‌ సమీపంలోని కేశవరెడ్డి రెసిడెన్షియల్‌ పాఠశాలలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో సాత్విక్(8) అనే విద్యార్థి మూడవ తరగతి చదువుతున్నారు. సాత్విక్‌ అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్లారు. ఆ తరువాత వారు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాత్విక్ విద్యార్థి మృతి చెందాడు. అయితే తన కొడుకుని ఉపాధ్యాయుడు కొట్టడంతో మృతి చెందాడు అంటూ చెన్గోమల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పాఠశాల యజమాన్యం మాత్రం స్పందిస్తూ సాత్విక్ బెడ్ పై నుంచి పడడంతో ఇంటికి తీసుకవెళ్లారని తెలిపారు. పాఠశాలలో మృతి చెందలేదని వివరణ ఇచ్చారు.